రంగస్థలం స్పెషల్ షోలకి గ్రీన్ సిగ్నల్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఇక ఈ సినిమాకి సంబందించిన స్పెషల్ షోల గురించిన సమాచారం బయటికొచ్చింది. దీనికి సంబందించిన అనుమతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వెలువడింది. ఆ అనుమతి ప్రకారం, మార్చ్ 30 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు స్పెషల్ షోలకి అనుమతినిచ్చారు. 

దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 జిల్లాలలో ఈ స్పెషల్ షోలకి అనుమతి లభించేసింది. ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇక్కడ కూడా స్పెషల్ షోల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మొత్తానికి రంగస్థలం సినిమా అభిమానుల కోసం కాస్త త్వరగానే విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS