భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు గాంచాడు.. ఎస్.ఎస్.రాజమౌళి. తనకు అపజయమే లేదు. ఒకదాన్ని మించి మరో సినిమా హిట్. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు అందుకున్న `బాహుబలి`కి కర్త కర్మ క్రియ అన్నీ రాజమౌళినే. అలాంటి రాజమౌళి కూడా అప్పుడప్పుడూ కాపీ మరకల్ని ఎదుర్కోవాల్సివస్తోంది. రాజమౌళి ఏ సినిమా తీసినా... ఎలాంటి పోస్టర్ విడుదల చేసినా `ఇదిగో.. కాపీ... `అంటూ సినీ విశ్లేషకులు.. వేలెత్తి చూపిస్తుంటారు. తాజాగా `ఆర్.ఆర్.ఆర్` పోస్టర్‌పైనా అలాంటి మరకే పడిపోయింది.
`ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్ పై దూసుకుపోతున్న పోస్టర్ అది. అటు మెగా ఫ్యాన్స్‌నీ, ఇటు ఎన్టీఆర్ అభిమానుల్నీ... అలరిస్తున్న ఈ పోస్టర్ పై ఇప్పుడు కాపీ ముద్ర పడింది. 2007లో వచ్చిన `ఘోస్ట్ రైడర్` పోస్టర్ ని చూపిస్తూ... రాజమౌళి అక్కడి నుంచి కాపీ కొట్టేశాడంటూ ప్రచారం మొదలెట్టారు. ఈ రెండు పోస్టర్లూ పక్క పక్కన పెట్టి చూస్తే ఒకేలా ఉన్నాయి. అక్కడున్న గుర్రం, బైక్‌లనే.. రాజమౌళి రిఫరెన్స్ గా తీసుకున్నాడనిపిస్తోంది. అయితే ఇది యాధృచ్ఛికంగా జరిగిందా, లేదంటే.. కావాలనే దాన్ని రాజమౌళి రిఫరెన్స్ గా తీసుకున్నాడా? అన్నది వేవేల సందేహాలకు తావిస్తోంది. దీనిపై రాజమౌళి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.