RRR రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

మరిన్ని వార్తలు

2021లో రిలీజ్ అవ్వ‌బోతున్న అతి పెద్ద సినిమా... `ఆర్‌.ఆర్.ఆర్‌`. ఇప్ప‌టికే కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు టీజ‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈరోజు 2 గంట‌ల‌కు `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి అప్ డేట్ వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ఇది వ‌ర‌కే చెప్పింది. దాంతో ఆ అప్ డేట్ ఏమిటీ? అంటూ ఆస‌క్తిగా ఎదురు చూశాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఇప్పుడు ఆ అప్ డేట్ వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` రిలీజ్ డేట్ ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించేసింది.

 

ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 13న విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో పాటు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల జాయింట్ స్టిల్ కూడా చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. గుర్రంపై.. చ‌ర‌ణ్‌, బైక్ పై ఎన్టీఆర్ దూసుకొస్తున్న స్టిల్ ని విడుద‌ల చేశారు. ద‌స‌రాకి తెలుగునాట పోటీ ఎక్కువ‌గానే ఉంటుంది. చిత్ర‌సీమ‌కు సంబంధించి అదో కీల‌క‌మైన సీజ‌న్‌. అయితే ఈ సీజ‌న్‌లో రాజ‌మౌళి సినిమా వ‌స్తోంది కాబ‌ట్టి, మిగిలిన సినిమాలు సైలెంట్ అయ్యే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS