రాజ‌మౌళి సినిమాలో విదేశీ సోయ‌గం

By iQlikMovies - October 29, 2018 - 10:13 AM IST

మరిన్ని వార్తలు

ఆర్‌.ఆర్‌.ఆర్‌... ప్ర‌స్తుతం అంద‌రి దృష్టీ దీనిపైనే.  రాజ‌మౌళి, రామారావు, రామ్‌చ‌ర‌ణ్ - ఈ కాంబోలో ఓ సినిమా అంటే ఆ మాత్రం ఆస‌క్తి ఉండాల్సిందే. అతి త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. న‌వంబ‌రు 6న హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా మొద‌ల‌వుతుంది.  ఈ సినిమాలో క‌థానాయిక‌లెవ‌ర‌న్న విష‌యంలో ఇంకా ఓ స్ప‌ష్ట‌త రాలేదు. 

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఓ విదేశీ క‌థానాయిక క‌నిపిస్తుంద‌ట‌. రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ హీరోయిన్‌, ఎన్టీఆర్ కోసం మ‌రో క‌థానాయిక ఎలాగూ ఉంటారు. వాళ్ల‌తో పాటు ఈ ఫారెన్ అమ్మాయి కూడా ఈ టీమ్‌లో ఉండ‌బోతోంది. అంటే.. ఇద్ద‌రు హీరోల‌కు ముగ్గురు హీరోయిన్ల‌న్న‌మాట‌. ఈ విదేశీ క‌థానాయిక ఎవ‌రైతే బాగుంటుంది? అనే విష‌యంలో రాజ‌మౌళి త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాడు. 

ఎన్టీఆర్ - రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ధ్య తొలి షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ని, రెండో షెడ్యూల్ లో క‌థానాయిక‌లు ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం. సెంథిల్ కెమెరామెన్‌గా ప‌నిచేయ‌నున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. 

దాదాపుగా బాహుబ‌లి టీమ్‌నే ఈ సినిమాకీ ప‌నిచేయ‌బోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS