ఈనెల 28న బాహుబలి 2 విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ అయిపోయాయని రాజమౌళి కూడా చెప్పేశారు. అయితే... బాహుబలి 2కి సంబంధించి ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయట. ఇప్పటికీ ఫైనల్ కరక్షన్స్ చేస్తూనే ఉన్నారని ఈ సినిమాకి గ్రాఫిక్స్ అందించిన కమల్ కన్నన్ తేల్చి చెప్పారు. గురువారం రాజమౌళి ఫైనల్ వర్షన్ చూసి మరో 5 కరక్షన్లు చెప్పాడట. ప్రస్తుతం చిత్రబృందం ఆ పనిలో తలమునకలై ఉందని తెలుస్తోంది. బాహుబలి 2కి ఎప్పుడో సెన్సార్ అయిపోయింది. అయినా కరక్షన్లు చేసుకోవొచ్చు. క్రియేటివ్ పరంగా మార్పులేం చేయకూడదు గానీ, టెక్నికల్ పరంగా చిన్న చిన్న కరక్షన్లకు అవకాశం ఉంది. దాన్ని చివరి నిమిషం వరకూ రాజమౌళి వాడుకొంటున్నాడన్నమాట. ఇలా చెక్కుతూనే ఉంటాడు కాబట్టి రాజమౌళిని జక్కన్నా.. అనేది.