మా ఇద్దరికి అదంటే భయం?!

మరిన్ని వార్తలు

నాగార్జున-జగపతి బాబుల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలోపల బయట అందరికి సుపరిచితమే.

అయితే వీరిరువురికి సంబంధించి ఒకేరకమైన భయం ఉందట! ఈ ఆసక్తి రేపే విషయం చెప్పింది మరెవరో కాదు కింగ్ నాగార్జున. ఇదంతా ఇవ్వాళ జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున, తనకి జగపతిబాబుకి దెయ్యాలంటే భయం అని, అలాంటిది తను రాజు గారి గది 2లో నటించడానికి ఎలా ఒప్పుకున్నావని తనని సరదాగా అడిగినట్టుగా చెప్పుకొచ్చాడు.

ఇక జగపతి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో నాగ చైతన్యకి తండ్రిగా నటించాడు. జగపతి బాబు మాట్లాడుతూసినిమా షూటింగ్ సరదాగా సాగిపోయిందని అలాగే చైతు తన కాళ్ళ ముందు పెరిగిన బిడ్డ అని తనకి నాగార్జున కుటుంబంతో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నాడు.

ఇదంతా చూసినవారు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ఇద్దరు భడా హీరోలు దెయ్యాలంటే భయం అనేసరికి సభలో నవ్వులు విరిసాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS