ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియాలోనే తెరకెక్కుతున్న భారీ చిత్రాలలో `ఆర్.ఆర్.ఆర్` ఒకటి. లాక్ డౌన్ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో ముందుగా సెట్స్‌పైకి వెళ్లేది `ఆర్.ఆర్.ఆర్` అని అనుకున్నారంతా. రాజమౌళి కూడా షూటింగు మొదలెట్టడానికి అన్ని సన్నాహాలూ చేసేసుకున్నాడు. అసలైన షూటింగ్ కి వెళ్లే ముందు ఓ ట్రైల్ షూట్ చేయాలని కూడా భావించాడు. లాక్ డౌన్ పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని, ఆ పరిమితులకు, ప్రభుత్వ గైడ్ లైన్స్‌కూ లోబడి షూటింగ్ ఎలా చేయొచ్చో చూపించడానికి ఈ ట్రైల్ షూట్ ని ఉపయోగించుకోవాలని భావించాడు. నాలుగు రోజుల క్రితమే ట్రైల్ షూట్ మొదలైందని వార్తలొచ్చాయి.
అయితే రాజమౌళి తన ఆలోచనని విరమించుకున్నాడట. ఇప్పుడు ట్రైల్ షూట్ లాంటివి ఏమీ చేయడం లేదని తెలుస్తోంది. పరిమితుల మధ్య షూటింగ్ చేయడం అసాధ్యమని రాజమౌళి భావిస్తున్నాడని, ట్రైల్ షూట్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదని రాజమౌళి గ్రహించడాని ఇన్ సైడ్ వర్గాల టాక్. ట్రైల్ షూట్‌నే సాధ్యం కాలేదంటే... ఇక నిజమైన షూటింగ్ కూడా చేయలేరు కదా? ఆ లెక్కన `ఆర్.ఆర్.ఆర్` ఇప్పట్లో మొదలవ్వడం అసాధ్యంలానే కనిపిస్తోంది.