డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ముప్పై శాతానికి పైగా పూర్తయిందట. ఇందులో ప్రధానంగా ముంబై షెడ్యూల్ ను కంప్లీట్ చేశారట. ఇప్పుడు షూటింగులకు అనుమతులు లభించాయి కాబట్టి త్వరలో షూటింగులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అయితే పూరి టీమ్ ఓ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారట. ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయట. వాటిలో విదేశీ నటులు నటించాల్సి ఉందట.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం వారితో షూటింగ్ పూర్తి చేయాలంటే ఎక్కువ రోజులు వేచి చూడాలి. అందుకే విదేశీ నటుల స్థానంలో లోకల్ నటులు ఉండేలా స్క్రిప్టులో పూరి కొన్ని మార్పులు చేస్తున్నారట. అంతే కాకుండా ఫారెన్ లొకేషన్లలో షూటింగ్ చేసే ఆలోచనను విరమించుకుని లోకల్ గా ఆ ఎపిసోడ్ లను పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారట. కరోనా కారణంగా చాలా విషయాల్లో మార్పులు జరుగుతున్నాయి. చాలామంది దర్శకులు దానికి తగ్గట్టుగా తమ సినిమాలలో మార్పులు చేస్తున్నారు. పూరికి కూడా తప్పడం లేదు. సినిమాను మొదట అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో పూరి ఓ స్పెషలిస్టు. అడ్డంకులు ఎదురైనప్పటికీ ఏదో ఒకటి చేసి సినిమాను త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో పూరి ఉన్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.