ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో తనకి మెగా ప్రొడ్యూసర్ కి మగధీర టైంలో తలెత్తిన కొన్ని సమస్యలని రాజమౌళి ఓపెన్ గా షేర్ చేశాడు.
వివరాల్లోకి వెళితే, మగధీర షూటింగ్ మొదలుపెట్టక ముందే, వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, సినిమా నడిచే ధియేటర్ల సంఖ్య పరంగా అలాగే 100 డేస్ విషయంలో కూడా జెన్యూన్ గా ఉందాము అని అనుకున్నారట.
అయితే రిలీజ్ అయిన తరువాత, ఒప్పందం ప్రకారం అలా జరగలేదట. ఇదే విషయం అల్లు అరవింద్ తో చర్చించుకున్నప్పుడు ఫ్యాన్స్ దగ్గరనుండి వస్తున్న ఒత్తిడి మేరకు తప్పట్లేదు అని చెప్పాడట.
ఇక అది నచ్చకనే, రాజమౌళి ఆ చిత్రం 100డేస్ వేడుకకి గైరుహాజరు అయినట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.