ఓ ప్రముఖ టాక్ షోలో నటి శ్రీదేవి పై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.
అయితే సదరు కామెంట్స్ పై స్పందించిన శ్రీదేవి మాత్రం అవన్నీ కేవలం కట్టుకథలు అని, తాను అలాంటి డిమాండ్స్ ఎన్నడూ ఎవరి మీద చేయలేదు అని చెప్పింది. ఇలా ఒకరు చెప్పినదానికి మరొకరు చెప్పినదానికి పొంతన లేకపోవడంతో అందరూ అయోమయంలో ఉన్నారు.
ఈ తరుణంలో రాజమౌళి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ అంశంపై స్పందించినట్టు తెలుస్తుంది! తాను ఆ అంశం గురించి Public Platform పైన మాట్లాడినందుకు చింతిస్తున్నాను అని, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే తాము ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో వారే నిర్ణయించుకుంటారు అని చెప్పాడు.
దీనితో ఈ అంశం మరో సరికొత్త చర్చకు దారితీస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.