ఎన్టీఆర్‌ 'రాజర్షీ' బహు బాగుందీ.!

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాధ ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుండి రెండో పాటని బయటికి వదిలారు. మొన్న విడుదలైన 'కథానాయకా..' సాంగ్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. లేటెస్ట్‌గా విడుదలైన 'రాజర్షీ మహర్షీ..' అనే సాంగ్‌కీ మంచి రెస్పాన్సే వస్తోంది. కాగా ఈ సినిమాని 'కథానాయకుడు', మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోయే 'కథానాయకుడు' పార్ట్‌కి సంబంధించిన సాంగ్స్‌నే ఇప్పుడు విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య తెలంగాణా ఎలక్షన్స్‌కి సంబంధించి టీడీపీ తరపున బాలయ్య విసృతంగా ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్‌ పోరు, ఫలితాల విడుదల ముగిసిపోయింది. రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే, ఎలక్షన్స్‌ ప్రచారం నిమిత్తం బాలయ్య తన దృష్టిని సినిమా నుండి కాస్త పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు సినిమాపైనే పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌ చేయనున్నారట. త్వరలోనే మిగిలిన పాటల్నీ విడుదల చేయనున్నారు.

ఈ బయోపిక్‌లో నటిస్తున్న కాస్టింగ్‌ ఆషామాషీ కాస్టింగ్‌ కాదన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ నటిస్తుండగా, మిగిలిన ముఖ్య పాత్రల నుండి టాలీవుడ్‌ నుండి సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా ఎంచుకున్న ప్రముఖులందరికీ మేకప్‌ వేసేసి, ఆ కాలంలోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్‌ క్రిష్‌. చిన్న పాత్రే అయినా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నారు ఈ సినిమాలోని తారాగణం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ బయోపిక్‌ని బాలయ్య తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS