మా మీద అత్యాచారాలు జరగవ్‌: రాఖీసావంత్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ కాస్టింగ్‌ కౌచ్‌పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాలిస్తామని చెప్పి, ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్‌పై లైంగిక వాంఛని తీర్చుకుంటారు. నేనూ ఆ బాధితురాలినే. అయితే అవకాశాలిస్తామని వాళ్లు, అవకాశాల కోసం నా లాంటి వాళ్లు ఒకరి అవసరం మరొకరు తీర్చుకుంటారు. తప్ప రేప్‌లు మాత్రం జరగవు సినీ పరిశ్రమలో. ఎవ్వరూ ఎవ్వరినీ బలవంతం చేయడమనేది జరగదిక్కడ. ఇద్దరి మ్యూట్యువల్‌ అండర్‌ స్టాండింగ్‌ మీదే, లైంగికపరమైన చర్యలు జరుగుతాయి సినీ పరిశ్రమలో.

ఇది నిజంగా నిజం అని రాఖీ సావంత్‌ చెప్పింది. అంతేకాదు, అవకాశాలొచ్చినా రాకపోయినా ఫర్వాలేదు. కానీ క్యారెక్టర్‌ ముఖ్యమనుకుంటే ఇక్కడ చెల్లుబాటు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాఖీ సావంత్‌. ఏ విషయాన్ని అయినా బోల్డ్‌గా మాట్లాడడం రాఖీసావంత్‌కి అలవాటు. అలా మాట్లాడే, కొన్ని అంశాల్లో వివాదాల్లోకెక్కుతుంటుంది రాఖీ సావంత్‌. కానీ కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా కరెక్ట్‌గా మాట్లాడిందని అంటున్నారు కొందరు విమర్శకులు.

ఇటీవల టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై నటి శ్రీరెడ్డి చేసిన రచ్చ వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదం టాలీవుడ్‌లో ముగిసిపోయింది. కానీ ఈ ప్రకంపనలతో అక్కడక్కడా ఎవరో ఒకరు ఈ విషయంలో ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా రాఖీ సావంత్‌ ఈ విధంగా స్పందించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS