డా రాజశేఖర్ నిన్న జరిగిన గరుడవేగ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కంటతడి పెట్టుకున్న వార్త ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది.
ఈ మధ్యనే ఆయన తల్లిగారు కాలం చేయ్యడంతో కొద్దిగా డిప్రెషన్ లో ఉన్న రాజశేఖర్ ఈ సందర్భంగా తన మనసులోని బాధని అదుపుచేయలేకపోయాడు. అలాగే తాను ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాలు విజయవంతం కాకపోవడంతో తన తల్లిదండ్రులు కూడా తన గురించి చాలా ఆందోళన చెందారు అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ చిత్రానికి సంబందించిన కథని తన దగ్గరకి తీసుకు వచ్చిన దర్శకుడు ప్రవీణ్ ని అభినందించాడు. ఇదే సమయంలో ఒక చిత్రాన్ని నిర్మించడం అంటే ఒక పెళ్ళి చేసి చూడడం, ఒక ఇళ్ళు కట్టి చూడడం కంటే కష్టమని చెబుతూ తాము ఈ చిత్రాన్ని తమ సొంత ఇంటి పెళ్ళిలా భావించి నిర్మించామని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
అయితే ఈ ఈవెంట్ చూసిన వారు మాత్రం రాజశేఖర్ లోని ఎవ్వరికీ తెలియని కొత్త కోణాన్ని చూసాము అన్న భావనని అందరు అభిప్రాయపడ్డారు.