గరుడ వేగ చిత్రంతో చాలా కాలం తరువాత మంచి హిట్ అందుకున్న తరుణంలో హీరో రాజశేఖర్ చాలా హ్యపిగా ఉన్నాడు.
అయితే నిన్న గరుడవేగకి వచ్చిన పాజిటివ్ టాక్ తో టీం మొత్తం చాలా ఖుషిగా ఉంది. ఆ ఆనందంలోనే నిన్న రాజశేఖర్ డ్యాన్సుల మీద డ్యాన్సులు చేసేశాడు. ఆయనతో పాటుగా హీరోయిన్స్ పూజా, శ్రద్ధా, దర్శకుడు ప్రవీణ్ అలాగే రాజశేఖర్ కుమార్తెలు కూడా ఆనందంలో డ్యాన్సులతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇక చిత్రం విషయానికి వస్తే, ప్రవీణ్ చాలా బాగా దర్శకత్వం వహించాడు అని అలాగే రాజశేఖర్ ని కూడా చాలా బాగా వాడుకున్నాడు అని చూసిన ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి.. గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించాడు అని చెప్పొచ్చు.