రాజ‌శేఖ‌ర్ కూతుర్లు త‌క్కువాళ్లేం కాదు..!

By iQlikMovies - July 03, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

క‌ల్కి సినిమా విష‌యంలో జీవిత బాగా జోక్యం చేసుకుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ కోడై కూస్తోంది. జీవిత అతి జోక్యం వ‌ల్ల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వర్మ చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ సినిమా విష‌యంలో జీవిత మాత్ర‌మే కాద‌ట‌.. జీవిత కూతుర్లు శివానీ, శివాత్మిక కూడా చాలాసార్లు జోక్యం చేసుకున్నార‌ని తెలుస్తోంది.

 

రాజ‌శేఖ‌ర్ డ్ర‌స్సింగ్‌, హెయిర్ స్టైల్‌... లాంటి విష‌యాలు వీరిద్ద‌రూ ద‌గ్గ‌రుండి చూసుకున్నార్ట‌. ఆ విష‌యంలో వీళ్ల మాటే నెగ్గాల‌ని పంతానికి పోయార‌ట‌. క‌ల్కి సినిమాలో వ‌ర్షంలో ఫైట్‌లో తీశారు. ఆ ఫైట్‌లో రాజ‌శేఖ‌ర్ మ‌రీ బ‌ద్ద‌కంగా క‌నిపించాడు. ఏమాత్రం క‌ద‌ల్లేదు. అస‌లు చుట్టూ అంత వ‌ర్షం ప‌డుతున్నా - రాజ‌శేఖ‌ర్‌పై ఒక్క వ‌ర్షం చుక్క కూడా ప‌డ‌దు.

 

`మా నాన్న వ‌ర్షంలో త‌డ‌వ‌కూడ‌దు.. స్టైలీష్‌గానే ఉండాలి` అని రాజ‌శేఖ‌ర్ కూతుర్లు ఆర్డ‌రు వేయ‌డంతో ద‌ర్శ‌కుడు ఆ ఫైటుని అలా తీయ‌డం త‌ప్ప‌లేదట‌. ఫైన‌ల్ క‌ట్ విష‌యంలోనూ ఇద్ద‌రి జోక్యం ఎక్కువైంద‌ని, ఈ విష‌యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ చాలాసార్లు నొచ్చుకున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS