రుద్రమదేవిలో వీరత్వం చూపించింది అనుష్క. భారత వీరనారి పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా మారింది. `సైరా` కోసం. అవును.. `సైరా`లో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర అనుష్కకే దక్కింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి - భారత తొలి స్వాతంత్య్ర సమరయోధుడైతే... తొలి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్.
ఆమె కోణంలోంచే `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి` కథ మొదలవుతుందని సమాచారం. ఈ కథ అనుష్క కోణంలో మొదలై.. అనుష్క కోణంలోనే ముగుస్తుందని, చిరంజీవికీ - అనుష్కకీ మధ్య సన్నివేశాలే ఉండవని, అనుష్క కనిపించేది కాసేపే అయినా.. సినిమా మొత్తం తాను ఉన్నట్టే ఉంటుందని తెలుస్తోంది.
సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. తమన్నా, నయనతార కథానాయికలుగా నటించారు. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేస్తారు.