ఇంగ్లీష్ సినిమా ప్రేరణతో రాజశేఖర్ కొత్త సినిమా !

మరిన్ని వార్తలు

సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇటీవలే కార్ ప్రమాదం నుండి అదృష్టం కొద్దీ బయటపడ్డారు. ప్రస్తుతం తన తరువాత సినిమా చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. 'పూలరంగడు, అహన పెళ్ళంట' చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 15న నుండి మొదలుకానుందని తెలుస్తోంది.

 

మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్ సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య మంచి సెంటిమెంట్ ఉంటుందని.. సినిమాలో ఆ సెంటిమెంట్ నే హైలైట్ అవ్వబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇంగ్లీష్ సినిమా 'టేకెన్' ప్రేరణ అట. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట.

 

ఇక రాజశేఖర్ గరడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉండొచ్చు. అయితే దర్శకుడు వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్, ఆయన గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుంటే ఈ సినిమాకి అది మైనస్ గా నిలిచే అవకాశం ఉంది. 2020 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల కానుంది. మరి రాజశేఖర్ కి తన కెరీర్ లో 'గరుడవేగ' చిత్రంలాగే ఈ చిత్రం కూడా మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS