తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయ స్థాయి ప్రశంసలు!

మరిన్ని వార్తలు

గడిచిన నాలుగైదు సంవత్సరాలలో వచ్చిన తెలుగు సినిమాలను ఒకసారి పరిశీలిస్తే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిశ మార్చుకుని మరో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. ఏ మాత్రం కొత్తధనం లేని పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాలను తీస్తే చూసే రోజులు పోయి.. వైవిద్యమైన కంటెంట్ కొంచెం ఉన్నా సరే ఆ చిత్రాలకు మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత ఏడాది వరకు ఆ మధ్య వచ్చిన “కేరాఫ్ కాంచరపాలెం”, “మజిలీ”, “జెర్సీ”, అలాగే ఇటీవలే వచ్చిన “బ్రోచేవారేవారురా”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”, “ఓ బేబీ” వంటి వినూత్న చిత్రాలు ఎన్నో విభిన్న కథాంశాలతో తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నావే. ఏమైనా ఇప్పటి తెలుగు చిత్రాలు ఒకప్పటి మన స్వర్ణయుగ చిత్రాలను గుర్తుకుతెస్తున్నాయి.

 

స్వర్ణయుగం అంటే.. మాయాబజార్ మిస్సమ్మ కాలంలో.. అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అయితే ఆ తరువాత కాలానుగుణంగా సినిమా మేకర్స్ కూడా మారుతూ తెలుగు సినిమా అంటే... రొటీన్ లవ్ స్టోరీలు, లాజిక్ లేని హీరో ఎలివేట్ సీన్స్ లు, అర్ధం పర్ధం లేని పంచ్ డైలాగ్ లు అని ఫిక్స్ అయ్యేలా చేసారు మన డైరెక్టర్స్. అందుకు తగ్గట్లుగానే గడిచిన రెండు దశాబ్దాలలో అరకొర కొన్ని సినిమాలు మినహాయించి.. అన్ని కమర్షియల్ చిత్రాలు టాలీవుడ్ ను ఎలాయి. ఓ టైంలో అయితే సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే చాలు.. ఇక ఆ సినిమా సూపర్ హిట్టు బాట పట్టేసినట్లే అని నమ్మేవాళ్లు.

 

అయితే ఇదే ఫార్మాట్ ను మన తెలుగు ప్రేక్షకులు మీద డైరెక్టర్స్ రుద్దే ప్రయత్నం చేసినా వాటిని తిప్పి కొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయనుకోండి. మొత్తానికి ఇన్నాళ్లకు తెలుగు పరిశ్రమకు కాలం కలిసివచ్చినట్లు అనిపిస్తోంది. బాహుబలి, సైరా, ఘాజీ, సాహో లాంటి సినిమాలతో టాలీవుడ్ కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందాయి. ఏమైనా తెలుగు పరిశ్రమను అంతకంతకు అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేర్చుతూ విమర్శకుల సైతం ప్రశంసలు అందించేలా టాలీవుడ్ ను తయారుచేస్తున్నందుకు మన టాలెంటెడ్ దర్శకులనుప్రత్యేకంగా అభినందించాలి. ఇలాగే మన పరిశ్రమ కొనసాగాలని కోరుకుందాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS