డా.రాజ‌శేఖ‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడ వేగ 126.18ఎం` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్

మరిన్ని వార్తలు

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం`. శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా బ్యాంకాక్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్ కార్య‌క్ర‌మాల షూటింగ్ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 15వ‌ర‌కు బ్యాంకాక్‌లో జ‌రిగే ఈ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ రాజ‌శేఖ‌ర్‌ను స్టయిలిష్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 4న డా.రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ డా.రాజ‌శేఖ‌ర్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS