'రాజ్‌దూత్‌'కి సెన్సార్‌ కష్టాలు?

By iQlikMovies - July 03, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

శ్రీహరి కొడుకు మేఘాంష్‌ డెబ్యూ చేస్తున్న సినిమా 'రాజ్‌దూత్‌'కి సెన్సార్‌ కష్టాలు మొదలయ్యాయి. సినిమాలో ఏదో అసభ్యత ఉందని కాదు ఈ కష్టం. ఇంకా సినిమా సెన్సార్‌ బోర్డ్‌ చెంతకు వెళ్లనే లేదట. కారణాలు పూర్తిగా తెలియవు కానీ, వాస్తవానికి 'రాజ్‌దూత్‌' ఈ శుక్రవారం విడుదల కావల్సి ఉంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ చేశారు. కానీ, చిత్రయూనిట్‌ మరోసారి వెనక్కి తిరిగి ఆలోచించినట్లు తెలుస్తోంది.

 

ఇందుకు కారణం, 'ఓ బేబీ'. ఈ వారం ఫోకస్‌ అంతా 'ఓ బేబీ'పైనే ఉంది. 'ఓ బేబీ' నుండి 'రాజ్‌దూత్‌' వంటి కొత్త హీరో సినిమా వైపు ఆడియన్స్‌ దృష్టి మరల్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దాంతో ఈ కొత్త కుర్రోడి లాంఛింగ్‌కి మరో వారం టైం పట్టేలా ఉందని తాజా సమాచారమ్‌. ఆలోచిస్తే, అదీ నిజమే. వచ్చే వారం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవే 'దొరసాని', 'నిను వీడని నీడను నేనే'.

 

ఈ రెండు సినిమాల పైన కూడా బజ్‌ బాగానే ఉంది ఈ క్రమంలో వీటి మధ్యనైనా మేఘాంష్‌ తట్టుకొని నిలబడగలడా.? ఈ డేట్‌ కాకుంటే, మరే డేట్‌.? ఆ తర్వాత అంటే జూలై 26న విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌'గా బాక్సాఫీస్‌ బద్దలు కొట్టేందుకు 'రౌడీ' మందీ మార్బలంతో కాసుక్కుర్చున్నాడు. ఇన్ని కష్టాల మధ్య పాపం.. ఈ కొత్త కుర్రోడి పరిస్థితేంటో ప్రస్తుతానికి సస్పెన్సే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS