అహనా పెళ్లంట... కామెడీ సినిమాల్లో అదో ట్రెండ్ సెట్టర్. జంథ్యాల సృష్టించిన అద్భుత పాత్రలన్నీ ఈ సినిమాలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా `నాకేంటి? అహ.. నాకేంటంట` అంటూ పిసినారి సంఘానికి అధ్యక్షుడి స్థాయి పాత్రలో కోట కనిపిస్తారు. ఆయన డైలాగులు, సీన్లు.. అన్నీ భలే నవ్విస్తాయి. ఇప్పుడు ఈ సినిమాలోని కోట పాత్రని మరోసారి గుర్తు చేయబోతున్నారు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడికి రాజేంద్ర ప్రసాద్ అంటే చాలా ఇష్టం. తన ప్రతీ సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ కి ఓ మంచి పాత్ర ఇస్తారు. `ఎఫ్ 2`లో సెకండ్ సెటప్ మెయింటైన్ చేసే భర్తగా.. రాజేంద్రుడి పాత్ర నవ్విస్తుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 తీస్తున్నారు. ఇందులోనూ నటకిరీటికి మంచి పాత్ర పడింది. ఇందులో పీనాసి సంఘం అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నాడని టాక్. ఈ పాత్ర... అహనా పెళ్లంటలో కోట పాత్రకు కొనసాగింపుగా ఉంటుందని టాక్. అసలే.. నటకిరీటికి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. మరి ఈసారి ఎన్ని నవ్వులు పండిస్తారో చూడాలి.