సమంత ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీమేన్ 2`. ఈ వెబ్ సిరీస్... ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. రాజ్ డీకేలు ఈ వెబ్ సిరీస్ ని రూపొందించిన విధానం, అందులో సమంత నటన... వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అయితే వివాదాలూ... ఈ వెబ్ సిరీస్ ని వదలడం లేదు. ఫ్యామిలీమెన్ 2 ట్రైలర్ రాగానే... అందులో సమంత పాత్రకు సంబంధించిన తమిళులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమిళుల చరిత్రనీ, పోరాటాన్నీ కించపరిచేలా సంభాషణలు ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. వెబ్ సిరీస్ విడుదలైన తరవాత కూడా.. ఆ వివాదం చల్లార లేదు.
ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్‌ను వెంటనే నిలిపివేయాలని, లేదంటే దీనిపై కోర్టుకెక్కుతామని తమిళ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. తమిళ ఈలం గురించి ఈ వెబ్ సిరీస్‌లో చూపించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్ ట్విట్టర్ వేదికగా అమేజాన్‌కు అట్టిమేటం జారీ చేశారు. తమిళుయులకు వ్యతిరేకంగా తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను వెంటనే ఆపేయాలని డిమాండి చేశారు. లేదంటే.. అమెజాన్ ప్రైమ్ పై న్యాయపోరాటం చేస్తామని సీమాన్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై రాజ్ అండ్ డీకేలు, అమేజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.