కాలా ఫాన్స్ ని భయపెడుతోంది

By iQlikMovies - April 30, 2018 - 15:55 PM IST

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కాలా' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ 27న విడుదల కావల్సిన ఈ సినిమా వాయిదాల పర్వంతో రిలీజ్‌ డేట్‌ని ఇంకా ఫిక్స్‌ చేసుకోలేకపోతోంది. ఎప్పుడో షూటింగ్‌ పూర్తయిన 'రోబో 2.0' ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇదివరకు సూపర్‌స్టార్‌ సినిమా వస్తుందంటే, పండగలా ఉండేది. కానీ ఇప్పుడు భయమేస్తుంది.వరుసగా మూడు ఫ్లాప్‌ సినిమాలు చేశాడు. 'లింగ', 'కబాలి' తదితర ఫ్లాప్‌ సినిమాలతో రజనీకాంత్‌ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది.

ప్రతీ సినిమాకి హైప్‌ క్రియేట్‌ చేయడం, ఆ తర్వాత సినిమా ఫ్లాప్‌ అవడం మామూలైపోయింది. రజనీకాంత్‌కి ఉన్న సూపర్‌ స్టార్‌డమ్‌ ఆయన సినిమాలకు హైప్‌ తెస్తే తేవచ్చు గాక. కానీ ఒకప్పటి నమ్మకం ఇప్పుడు లేదు. 'రోబో 2.0' పలుమార్లు వాయిదాలు పడడం కూడా దీనికి ఒక కారణం. 'రోబో 2.0' ఇక ఇప్పట్లో రాదని రజనీకాంత్‌ ఆందోళనపడి చేసిన సినిమా ఈ 'కాలా'. జూన్‌ 7న ఈ సినిమా విడుదలవుతుంది అని చెబుతున్నారు. కానీ విడుదలవుతుందా? లేదా ? అనే సస్పెన్స్‌ అలాగే ఉంది.

'రోబో 2.0' వచ్చి ఉంటే, 'కాలా'పై ఇంత ఆందోళన ఉండేది కాదేమో. ఇన్ని అననుకూల పరిస్థితుల్లో సినిమా రిజల్ట్‌ ఏమవుతుందోనని అభిమానులు భయపడుతున్నారు. 'కబాలి' డైరెక్టర్‌ పా రంజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS