తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తన శ్రీలంక పర్యటన రద్దు చేసుకున్నాడు.
రోబో 2.0 నిర్మాత శ్రీలంకలో అనాధలైన తమిళ ప్రజల కోసం ఇండ్లు కట్టించాడు. వీటి ప్రారంబోత్సవానికి రజినిని ముఖ్య అతిధిగా పిలవగా, తమిళనాడులోని కొన్ని ప్రజా సంఘాలు ఆయన శ్రీలంక వెళ్ళడానికి సిద్ధపడటాన్ని ఆక్షేపించాయి.
దీనితో తన పర్యటన రద్దు చేసుకునట్టుగా తెలుస్తుంది. అయితే తను తమిళ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏనాడు నడుచుకోనని స్పష్టంచేశాడు. అయితే తాను శ్రీలంకలోని తమిళ ప్రజలను కలిసే అవకాశం వస్తే తప్పక కలుస్తానని తెలిపాడు.