రామ్‌కి ఆ ఛాన్స్‌ మిస్సయ్యిందా?

By iQlikMovies - June 07, 2018 - 17:16 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవల 'గరుడవేగ' సినిమాతో టాలీవుడ్‌ దృష్టినే కాకుండా ఇతర సినీ పరిశ్రమల దృష్టిని కూడా ఆకర్షించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు. హీరోగా అందరూ మర్చిపోయిన సీనియర్‌ హీరో రాజశేఖర్‌ని ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చాడు ప్రవీణ్‌ సత్తారు. అంతేకాదు, హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌, టేకింగ్‌తో డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సత్తారు ఓ మెట్టు పైకి ఎక్కాడు. 

ఇకపోతే తాజాగా యంగ్‌ హీరో రామ్‌తో ప్రవీణ్‌ సత్తారు ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ మరో హీరో చేతికి చిక్కిందని సమాచారమ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్టార్‌ హీరోతో తెరకెక్కించాలని డైరెక్టర్‌ యోచిస్తున్నాడట. అది కూడా తమిళ హీరో అయితే బావుంటుందని భావిస్తున్నాడట. ఆ దిశగా తమిళ స్టార్‌ హీరో కోసం సెర్చింగ్‌ మొదలెట్టేశాడట. ఆల్రెడీ తమిళంలో ఓ స్టార్‌ హీరోకి స్టోరీ వినిపించాడనీ, సదరు హీరో ఓకే చేశాడనీ సమాచారమ్‌. ఇకపోతే రామ్‌ ఈ సినిమాతో ఏదో ప్రయోగం చేయబోతున్నాడని ఆయన అభిమానులు భావించారు. కానీ అది కాస్తా ఇలా అటకెక్కేసినట్లు కనిపిస్తోంది.  

అసలింతకీ ప్రచారంలో ఉన్న ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ, రామ్‌ ప్రస్తుతం 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలో నటిస్తున్నాడు. త్రినాధరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS