రజనీకాంత్ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం చాలా కామన్ ఇష్యూనే. ఆయన స్టార్‌డమ్‌కి ఇదేమంత పెద్ద రికార్డు కాదు, కానీ, సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో వంద కోట్లు సాధించింది రజనీకాంత్ 'కాలా'.
ఇకపోతే, ఆయన స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ వసూళ్లు అంత లెక్కల్లోనివి కావని ట్రేడ్ పండితుల అభిప్రాయం. లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద 'కాలా' ఎంత వసూళ్లు చేస్తుందనే విషయంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. సినిమా విషయానికి వస్తే, సినిమాలో రజనీకాంత్ స్టార్‌డమ్‌ని డైరెక్టర్ బాగా వినియోగించుకోలేకపోయాడనే విమర్శలు కూడా వున్నాయి. నిర్మాతగా ధనుష్ బెస్ట్ నిర్మాణ విలువలు అందించాడు.
'కబాలి'తో ఫెయిలైన పా రంజిత్ ఈ సినిమాతో ఓకే అనిపించుకున్నాడు కానీ, గత ఫెయిల్యూర్‌ని దృష్టిలో పెట్టుకోకుండా, వెంటనే మరో ఛాన్సిచ్చిన సూపర్‌స్టార్‌తో ప్రాజెక్ట్ అంటే డైరెక్టర్ పా రంజిత్ ఇంకాస్త ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేసి ఉండుంటే, బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. సూపర్‌స్టార్ తన వంతుగా తాను బాగానే న్యాయం చేశాడు. కానీ అభిమానుల అంచనాల్ని అందుకోవడంలో నిరాశ పరిచినట్లే అని చెప్పాలి.
ఈశ్వరీరావు ఈ సినిమాలో రజనీకాంత్‌కి భార్య పాత్రలో తన వంతు న్యాయం చేసింది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కీలక పాత్రలో హుందాతనం ఉట్టిపడే పాత్ర పోషించింది. ఆమె పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. చూడాలిక, లాంగ్ రన్‌లో 'కాలా' వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.