టాలీవులో పలువురు ప్రముఖులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, మీడియా దృష్టిని ఆకర్షించి, ఏం సాధించాలనుకుందో ఆమెకే తెలియకుండా, ఏదో చేయాలనుకుని వచ్చి, ఏమీ చేయలేక, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన నటి శ్రీరెడ్డి సెకండ్ ఇన్నింగ్స్‌లో నేచురల్ స్టార్ నానిపై అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేసింది.
ఇలాంటి ఆరోపణలు సభ్య సమాజం హర్షించదు. ఆరోపణలకు ఆధారాలుంటే చట్టపరంగా వెళ్లాలి. మీడియా పరంగా ఆధారాలను చూపెట్టినా పర్వాలేదు. ఆధారాలు చూపెట్టకుండా, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. నాని మౌనంగా ఉంటున్నాడంటే, అది చేతకాని తనం కాదు. హుందాతనం. సరైన సమయంలో నాని సరైన నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదేంటనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
బిగ్‌బాస్ షోలో నానియే నన్ను ఆడ్డుకున్నాడు. షోలో పార్టిసిపేట్ చేయనీయకుండా అని శ్రీరెడ్డి చెబుతోంది. అయితే నాని ఇదంతా నాన్సెన్స్ అని కొట్టిపాడేశాడు. అసలిదంతా పట్టించుకోవల్సిన అవసరం లేదని నాని అన్నాడు. దీనికే నానిపై శ్రీరెడ్డి పగ తీర్చుకుంటోందా? లేక ఇదంతా గత కొంత కాలంగా శ్రీరెడ్డికి ఉన్న, అందరికీ తెలిసిన ఆమె పైత్యమేనా? అనేది తెలియాల్సి ఉంది.
వరుస పెట్టి నానిపై ఇలాంటి అనుచిత ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి నోటికి తాళం పడేదెప్పుడో చూడాలిక.