సూపర్‌స్టార్‌ మళ్లీ హ్యాండిస్తాడా?

మరిన్ని వార్తలు

రజనీకాంత్‌ నటించిన 'కాలా' చిత్రం ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్‌ ఆఫీషియల్‌గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 'కాలా' విడుదలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ధియేటర్స్‌ బంద్‌ ఇప్పుడు తమిళనాడుకూ పాకింది. ప్రభుత్వం విధించిన స్థానిక వినోద పన్నులు, ధియేటర్‌ లైసెన్స్‌ పొడిగింపు వ్యవహారాలకు నిరసనగా ధియేటర్స్‌ యాజమాన్యం మార్చి 16 నుండి సమ్మెకు దిగింది. ఈ నేపధ్యంలో ఆల్రెడీ రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించిన కొన్ని సినిమాల విడుదల ఇప్పుడు డైలమాలో పడింది. అందులో సూపర్‌స్టార్‌ రజనీ సినిమా కూడా ఉందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో, రజనీ నటించిన 'కాలా' చిత్రం ఇప్పుడప్పుడే రాదంటూ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్‌ స్పందించింది. 

ఈ వైరల్‌ అవుతోన్న న్యూస్‌తో తమకు ఏ సంబంధం లేదనీ, 'కాలా' విడుదలపై ఎలాంటి అనుమానాలు వద్దనీ అభిమానులకు క్లారిటీ ఇవ్వడంతో రజనీ ఫ్యాన్స్‌ కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ధనుష్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'కబాలి' డైరెక్టర్‌ పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి ఈ చిత్రంలో రజనీకి జోడీగా నటించింది. మరో పక్క రజనీకాంత్‌ నటించిన 'రోబో 2.0' చిత్రం విడుదలపైనా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. 

ఇదిలా ఉంటే, రజనీకాంత్‌ ఇటీవలే హిమాలయాలకు వెళ్లి వచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS