సినిమాలకి గుడ్ బై చెప్పిన అమీ జాక్సన్?

By iQlikMovies - March 22, 2018 - 12:51 PM IST

మరిన్ని వార్తలు

నటి అమీ జాక్సన్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు ఒక వార్త అంతార్జాలంలో హల్చల్ చేస్తున్నది.

ఇంతకి వైరల్ గా మారిన ఆ వార్త ఏంటంటే- అమీ జాక్సన్ సినిమాలకి గుడ్ బై చెప్పేసిందిట! ఈ ప్రకటన ఆమెనే చేసిందా లేక వేరే ఎవరైనా సృష్టించారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వైరల్ అవుతున్న వార్త ప్రకారం, అమీ జాక్సన్ కి ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో ఆమె నిరాశకి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వార్త సారాంశం.

ఇదే సమయంలో ఆమె రజినీకాంత్ సరసన రోబో 2.0 సినిమాలో నటించింది. అయితే ఆ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికి అంతుచిక్కట్లేదు. కారణాలు తెలియనప్పటికీ ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నది.

కారణాలు ఏవైనా సరే ఇలా ఒక్కసారిగా అమీ జాక్సన్ సినిమాల నుండి నిష్క్రమించడం ఆమె అభిమానులకి మింగుడుపడకుండా మారింది. చూద్దాం.. మరి ఈ వార్త పైన అమీ జాక్సన్ ద్రువీకరీస్తుందా లేదా అనేది చూడాలి..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS