సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రం మొన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మొదటి షో నుండే యావరేజ్ టాక్ రావడం మొదలైంది, అయినప్పటికి సూపర్ స్టార్ క్రేజ్ ముందు ఈ టాక్ పటాపంచలు అవుతున్నాయి.
ఇలా యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ, అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు కేవలం రెండు రోజుల్లో వసూలు చేసి రజిని స్టార్ స్టేటస్ ని నిరూపించింది. అయితే ఇది ఆయన గత చిత్రం కబాలి తో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే కబాలి చిత్రానికి 1.9 మిలియన్ డాలర్లు ఒట్టి ప్రీమియర్ షోలకే వచ్చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సుమారు రూ 50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే సమయంలో నేడు రేపు కూడా సెలవులు కావడంతో కలెక్షన్లు సుమారు రూ 100 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.
మొత్తానికి టాక్ ఏదైనా.. రజినీ స్టార్ స్టేటస్ ముందు తలవంచాల్సిందే అని చెప్పొచ్చు.