తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన రైతుబంధు పధకం క్రింద సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య అయిన నమ్రత లకి కూడా ప్రభుత్వం నుండి కొంత మొత్తంలో ఆర్ధిక సహాయం అందింది.
అయితే ఆర్ధికంగా తాము ఆ ఖర్చులు వేచ్చించుకునే పరిస్థితి ఉండడంతో ఆ ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేయాల్సింది వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నమ్రత తమ వద్దకు వచ్చిన మహేశ్వరం వ్యవసాయధికారికి రూ 16 వేల చెక్కుని తిరిగి ఇచ్చేశారు.
మహేష్ కుటుంబం ప్రభుత్వానికి ఇలా తమకి వచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేయడం పట్ల అందరు హర్షం ప్రకటిస్తున్నారు. ఇక మహేశ్వరం దగ్గర మహేష్ & నమ్రతలకి దాదాపు రెండెకరాల లోపు సాగు భూమి ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంది.
మొన్నేమధ్యనే దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇలానే తనకి వచ్చిన ఆర్ధిక సహాయాన్ని తిరిగి ఇచ్చేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు.