రజనీకాంత్ ఓ తిరుగులేని సూపర్ స్టార్. ఈ వయసులో కూడా అభిమానుల్ని మెస్మరైజ్ చేయడం ఎలాగో రజనీకి బాగా తెలుసు. అంత స్టార్ డమ్ ఉన్నా రజనీ ఎప్పటికీ సింపుల్‌గా కనిపిస్తాడు. భోళా మనిషి. తన జీవితంలోని ఎదురైన ప్రతి అనుభవాన్నీ వీలైనప్పుడల్లా పంచుకుంటూనే ఉంటాడు. అయితే రజనీకి ఓ లవ్ స్టోరీ ఉంది. అది మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు. కానీ.. ప్రముఖ నటుడు, రజనీకాంత్ స్నేహితుడు దేవన్ ఈ లవ్ స్టోరీని లీక్ చేసేశాడు. రజనీకాంత్ - దేవన్ చాలా సినిమాల్లో నటించారు. బాషాలోనూ దేవన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. ఇద్దరూ మంచి మిత్రులు. ఓరోజు చెన్నైలో షూటింగ్ జరుగుతోందట. కలిసి డిన్నర్ చేద్దాం వస్తావా.. అంటూ దేవన్‌ని రజనీ ఆహ్వానించాడట.
దేవన్ రజనీ దగ్గరకు వెళ్లేటప్పటికి రజనీ మద్యం సేవిస్తూ కూర్చున్నాడట. ఆ మత్తులోనే తన తొలి ప్రేమ కథ గురించి దేవన్‌కి చెప్పేశాడట. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బెంగళూరులో కండెక్టరుగా పని చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రేమ కథ ఇది. అప్పట్లో నిర్మల అనే ఓ డాక్టరుతో రజనీకి పరిచయమైంది. రజనీ పనిచేసే బస్సులోనే నిర్మల ప్రతిరోజూ ప్రయాణం చేసేది. అలా ఇద్దరూ స్నేహితులైపోయారు.
ఓ రోజు తాను నటిస్తున్న ఓ నాటకాన్ని చూడ్డానికి రమ్మని నిర్మలని ఆహ్వానించాడట రజనీ. అందులో రజనీ నటన ఆమెకు చాలా బాగా నచ్చింది. అందుకే రజనీకి తెలియకుండా మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి రజనీ పేరుమీద అప్లికేషన్ లెటర్ పంపింది. అక్కడి నుంచి రజనీకాంత్‌కి ఇంటర్వ్యూ లెటర్ కూడా వచ్చిందట. కానీ బెంగళూరు నుంచి చెన్నై వెళ్లడానికి రజనీకాంత్ దగ్గర డబ్బుల్లేవట. అప్పుడు నిర్మలనే 500 ఇచ్చి రజనీని చెన్నై పంపిందట. కానీ చెన్నై నుంచి తిరిగి రాగానే నిర్మల వెదుక్కుంటూ వెళితే నిర్మల కనిపించలేదట. ఆ కుటుంబం మరో ఊరు వెళ్లిపోయారని చుట్టు పక్కల వాళ్లు చెప్పారట. అప్పటి నుంచీ రజనీ - నిర్మల కలుసుకోలేదట.
ఈ విషయాన్ని దేవన్‌కి ఓ కథలా చెప్పుకొచ్చాడు రజనీ. ఇప్పుడు ఆ లవ్ స్టోరీని మీడియాకు లీక్ చేశాడు దేవన్. రజనీకాంత్ వెనుక ఇంతటి విషాద ప్రేమకథ ఉందా అని అభిమానులు ఇప్పుడ ఆశ్చర్యపోతున్నారు. రజనీకాంత్ జీవితాన్ని సినిమాగా తీస్తే.. ఈ లవ్ ఎపిసోడ్ హైలెట్