వెబ్ సిరీస్‌లు ఇప్పుడు రాజ్యం ఏలుతున్నాయి. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత బడడంతో ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై ఎక్కువ దృష్టి పెట్టారు ప్రేక్షకులు. అవి మినహా మరో మార్గం లేకపోవడంతో - వాటికి డిమాండ్ మరింత పెరిగింది. వెబ్ లో మంచి కంటెంట్ కూడా వస్తోంది. భవిష్యత్తు వెబ్ సిరీస్ దే అని ఢంకా బనాయించి మరీ చెప్పొచ్చు. రాజమౌళి కూడా అదే అంటున్నాడు. సినిమాలతో పోలిస్తే కంటెంట్ విషయంలో వెబ్ సిరిస్‌లు చాలా ముందున్నాయని, తనక్కూడా ఎప్పటి నుంచో వెబ్ సిరీస్‌లపై దృష్టి ఉందని చెప్పుకొచ్చాడు.
ఇండియాలో రూపొందిన వెబ్ సిరీస్‌లలో తనకు `స్పెషల్ ఆప్స్` బాగా నచ్చిందని, `ఫ్యామిలీ మెన్` చూడమని చాలామంది సలహా ఇచ్చారని, త్వరలో ఆ వెబ్ సిరీస్ కూడా చూస్తానని చెప్పుకొచ్చారు రాజమౌళి. వెబ్ సిరీస్‌లు తీయాలని ఉన్నా, తనకున్న కమెట్‌మెంట్స్ వల్ల వాటి గురించి ఆలోచించలేకపోతున్నానని, ఈ లాక్ డౌన్ సమయంలో పుస్తకాలు చదవుతూ, డాక్యుమెంటరీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జక్కన్న.