సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే భాషతో సంబంధం లేకుండా బజ్ క్రియేట్ అవుతుంది. కానీ, 'రోబో' తర్వాత సూపర్ స్టార్ సినిమాలకు అంతగా ఆదరణ దక్కడం లేదు. విడుదలకు ముందు క్రియేట్ అయిన బజ్ విడుదల తర్వాత ఉండడం లేదు. ఆయన తాజాగా 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా మురుగదాస్ టేకింగ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పొచ్చు.
ఇక ఆయన సూపర్ స్టార్‌తో సినిమా అంటే, ఏ రేంజ్‌లో తెరకెక్కించి ఉంటారో కదా. అందుకే 'దర్బార్'పై అంచనాలు బాగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్‌లో 'దర్బార్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రజనీకాంత్ గత చిత్రాలతో పోల్చితే, ఈ సినిమాకి చేస్తున్న ప్రమోషన్స్ హడావిడి కాస్త తక్కువగానే ఉందంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకో కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఈ సినిమాకి. అయితే, సినిమాలో కంటెంట్ బాగుంటే, ప్రమోషన్స్‌తో సంబంధం లేకుండా మంచి విజయం దక్కించుకునే అవకాశాలుంటాయి.
తెలుగులో సంక్రాంతికి రిలీజ్ కానున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో..', మహేష్ 'సరిలేరు..' సినిమాలకు రజనీకాంత్ 'దర్బార్' పోటీ అవుతుందా.? ఎన్ని సినిమాలైనా హ్యాండిల్ చేయగల సత్తా సంక్రాంతి పండగకి ఉంది అని సినీ ప్రముఖుల నమ్మకం. చూడాలి మరి, ఈ సారైనా రజనీకాంత్ తన స్టైల్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మ్యాజిక్ చేస్తారో లేదో.?