రజనీకాంత్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా - రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు? పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు? పార్టీ విధి విధానాలేంటి? గుర్తేంటి? అనే విషయాలపై వాడీ వేడీ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నిజానికి ఈ యేడాది మార్చిలో రజనీ రాజకీయ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కరోనా వల్ల సాధ్యం కాలేదు. ఆగస్టులోనైనా పార్టీ ప్రకటన ఉంటుందని రజనీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ... ఈసారీ కుదరడం లేదట. అయితే.. ఇప్పుడు రజనీ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం సిద్ధం చేశారని టాక్.
నవంబర్లో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి రజినీకాంత్ కీలక ప్రకటన చేయనున్నారని, పార్టీ గుర్తుని, విధి విధానాలనూ ప్రకటించబోతున్నారని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ మధ్య ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. మరి ఈసారైనా... రజనీ నోరు విప్పుతారో లేదో చూడాలి.