'పేట'లో సూపర్‌స్టార్‌.!

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల జోరు కొనసాగిస్తూనే ఉన్నారు. 'రోబో 2.0' చిత్రం ఎప్పుడో షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. విడుదల డేట్‌ విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. ఈలోగా అల్లుడు ధనుష్‌ నిర్మాణంలో సూపర్‌స్టార్‌ నటించిన 'కాలా' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

'కాలా' తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది . శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని లేటెస్టుగా విడుదల చేశారు. చేతిలో కొవ్వొత్తుల స్టాండ్‌ పట్టుకుని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న రజనీకాంత్‌ ఫస్ట్‌లుక్‌కి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్‌కి జోడీగా ముద్దుగుమ్మ త్రిష నటిస్తోంది. సూపర్‌స్టార్‌తో జత కట్టాలన్న త్రిష కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. కాగా సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సిమ్రాన్‌ కనిపించబోతోందనీ సమాచారమ్‌. అలాగే విజయ్‌ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.  

మరోవైపు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'రోబో 2.0' టీజర్‌ ఈ నెల13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నిజంగా సూపర్‌స్టార్‌ అభిమానులకు పండగే. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్‌ విడుదలవుతోంది. ఇక సినిమా రిలీజ్‌ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS