వినాయక చవితికి '2.0' టీజర్‌ పండగ.!

By iQlikMovies - September 07, 2018 - 18:41 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో వస్తున్న 'రోబో 2.0' చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వెలువడింది. 

వినాయక చవితి సందర్భంగా 'రోబో 2.0' టీజర్‌ విడుదల చేయనున్నారట. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఒకటీ అరా ఫస్ట్‌లుక్స్‌ తప్ప అంతకు మించిన అప్‌డేట్స్‌ ఏమీ రిలీజ్‌ కాలేదు. అలాంటిది టీజర్‌ రాబోతోందంటే అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహించారు. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. 

ఇప్పటికే చాలా వాయిదాల పర్వంతో నడుస్తోన్న ఈ సినిమా విడుదల డేట్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. నవంబర్‌లో సినిమా విడుదల కానుందని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కానీ ఆ డేట్‌కి 'రోబో 2.0' విడుదలవుతుందా? లేదా? అనే అనుమానం ఇంకా ఆడియన్స్‌లో నెలకొంది. ఎట్టకేలకు సినిమా టీజర్‌ విడుదల కానుంది. ఈ నెల 13న టీజర్‌ విడుదల కానుంది. బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇటీవల 'కాలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతోన్న 'రోబో 2.0' కోసం అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS