రజినీకాంత్ రాజకీయ ప్రకటన

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి కొనసాగుతున్న హైడ్రామాకి ఈ నెల 31తో బ్రేక్ పడనుంది. ఎందుకంటే రజిని తన మనసులో మాట ఆరోజు బయట పెట్టనున్నాడట. 

వివరాల్లోకి వెళితే, రజినీకాంత్ తన అభిమానులని వ్యక్తిగతంగా కలిసేందుకు అభిమానుల ఆత్మీయ కలయిక పేరుతో ఈ మధ్యనే ఒక అయుదు రోజులు పాటు తన అభిమానులని కలిశాడు. ఈరోజు నుండి మలివిడత అభిమానులతో భేటీ అవుతున్నాడు, ఈ కలయిక డిసెంబర్ 31 వరకు కొనసాగే నేపధ్యంలో ఆయన ఒక కీలక ప్రకటన చేశాడు.

ఆ ప్రకటనలో- తనకి రాజకీయాలు కొత్తేం కాదని, తన రాజకీయ భవిష్యత్తు గురించిన ప్రకటన ఈ నెల 31వ తేదీన స్పష్టం చేస్తాను అని తెలిపాడు. దీనితో ఆయన రాజకీయ కార్యాచరణ కాని లేక ఆయన రాజకీయాల్లోకి వచ్చేది లేనిది అన్న అంశం ఈ ఆదివారంతో తెలిసిపోనుంది. 

అయితే ఆయన అభిమానులు మాత్రం రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే కోరుకుంటున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS