యంగ్ హీరోలు- శర్వానంద్ & రాజ్ తరుణ్ ఇప్పుడు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు. వీరి చిత్రాలకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ క్రేజీ హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో ఉంటే ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.
ఇక ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ ని దర్శకత్వం చేయడానికి ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందుకొచ్చాడు. ఈ ముగ్గురు ఎనర్జీని కలిపి ఒక సినిమాగా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. దువ్వాడ జగన్నాధం వంటి కమర్షియల్ హిట్ తరువాత చేస్తున్న చిత్రం అవ్వడం అలాగే ఒక మల్టీ-స్టారర్ కూడా అవ్వడంతో ఈ సినిమా పైన క్రేజ్ వచ్చేసింది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించానున్నారట. అయితే ముందుగా ఈ చిత్రంలో సాయి ధరం తేజ్-వరుణ్ తేజ్ ని తీసుకోన్నున్నారు అన్న ప్రచారం జరగగా అది ఒట్టి పుకారు అని ఇప్పుడు తేలిపోయింది.
శర్వా-రాజ్ లని కమర్షియల్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ ఏ కమర్షియల్ యాంగిల్ లో చూపిస్తాడు అన్నది వేచి చూడాలి.