సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ఎంట్రీకి సంబందించిన కీలక ప్రకటన చేయడానికి గల ప్రక్రియని మొదలుపెట్టేశాడట!
ఆయన రాజకీయ ఎంట్రీ పై నెలకొన్న సందేహాలకు చెక్ పెడుతూ ఆయన రాజకీయ ఎంట్రికి కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చేవిధంగా ఆయన ఒక కమిటీ వేశాడు. ఆ కమిటీ ప్రస్తుతం ఆయన పార్టీ గుర్తు, జెండా, అజెండాల రూపకల్పనలో మునిగినట్టు తెలుస్తున్నది.
ఇక అవి జరిగిపోగానే, ఎలక్షన్ కమిషన్ లో ఆయన పెట్టబోయే పార్టీని రిజిస్టర్ చేయంచడం వంటి పనులు కూడా చూసుకోనుంది. అయితే రజిని తన రాజకీయ ఎంట్రీ పై ప్రకటన చేసే సమయంలోపే ఈ ముందు కార్యక్రమాలు అన్ని జరిగిపోవాలి అన్నది ఆయన సన్నిహిత వర్గాల అభిప్రాయమాట!
దీనితో రజినికాంత్ అతిత్వరలోనే తన రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అది ఆయన పుట్టినరోజు లోపే లేదా అదే రోజు అవుతుంది అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం.