కమర్షియల్ ఎంటర్టైనర్స్ చిత్రాలకి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు ప్రేక్షకులని ఒక ఆటాడిస్తా అంటున్నాడు.
వివరాల్లోకి వెళితే, హరీష్ శంకర్ చేయబోయే కొత్త చిత్రానికి ‘దాగుడుమూతలు’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకునట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన లోకేషన్స్ కూడా ఫైనలైజ్ చేసేసిన హరీష్, ఇక ఈ చిత్ర కథని హీరోలకి వినిపించే పని చేయనున్నాడట!
ఫిలిం నగర్ వర్గాలు మాత్రం ఇది ఇద్దరు హీరోల కథ అని, ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోస్ నటించే ఆస్కారం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
DJ చిత్ర రిజల్ట్ తో కెరీర్ పీక్ లో ఉన్న హరీష్ ఇక ఇద్దరు హీరోలతో దాగుడుమూతల ఆటాడిస్తా అంటున్నాడు.