ఒక్క తమిళంలోనే కాకుండా.. భారతీయ భాషలన్నింటి లోనూ పాపులారిటీ కలిగి.. ఇండియన్ సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగానూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇంతటి స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన రజని ఇప్పుడు 'సూపర్ జోకర్ గా మారనున్నాడా అనే చర్చ మొదలైంది. ఆరు పదులు దాటింగా సినిమాల్లో ఇప్పటికీ కొంచెం అటూ ఇటుగా సూపర్ స్టార్ గానే చలామణీ అవుతున్న రజని.. రాజకీయాల్లో మాత్రం 'సూపర్ జోకర్ గా మారే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
జాతీయ స్థాయిలో మొదలైన ఈ చర్చ ప్రకారం.. రాజకీయాలకు రజనీ 'రామ్ రామ్' చెప్పేయబోతున్నాడు. రాజకీయాలు తన వల్ల కాదని చేతులు ఎత్తేయబోతున్నాడు. రజనీ రాజకీయ ప్రకటన చేసి రెండు మూడేళ్లు కావస్తున్నా.. కనీసం ఇప్పటివరకు కనీసం పార్టీ పేరు కూడా ప్రకటించకపోవడం, మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అయినా చప్పుడు చేయకుండా ప్రేక్షక పాత్ర పోషించడం, రాజకీయ ప్రకటన చేశాక, ఆ దిశగా అడుగులు వేయకపోగా. మునుపెన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం.. వంటి అంశాలు పరిగణనలోకి తీసుకొని.. సినిమాల్లో సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన రజనీ.. రాజకీయాల్లో 'సూపర్ జోకర్'గా మారడం అనివార్యం అనే అంచనాలు వెలువడుతున్నాయి. మురుగదాస్ దర్సకత్వంలో రజనీ నటిస్తున్న 'దర్బార్' సంక్రాంతికి సందడి చేయనుంది. చాలా కాలం తరువాత రజని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మెల్లగా క్రేజ్ ఏర్పడుతోంది!!