నందమూరి బాలకృష్ణకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక దానితో ఒకటి పొంతన లేకపోయినా.. 'కోకోకోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ' అని నినాదాలు చేస్తూ మురిసిపోయే వీరాభిమానులు బాలయ్య సొంతం. అలాగే అతని కెరీర్ బిగిన్ అయినప్పటి నుంచి తనని బొద్దుగా చూడడం కూడా అభిమానులకు అలవాటు. కానీ ఇప్పుడు రూలర్ సినిమా కోసం బాలయ్యను స్లిమ్ గా చూపిస్తుండడం బాలయ్య ఫాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలయ్య తాజా చిత్రం రూలర్ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్స్ లో బాలయ్య స్టైలిష్ గా కంటే.. పేషంట్ లా ఉన్నాడని ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. అసలే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల పరాజయాలతో డీలా పడి ఉన్న ఫ్యాన్స్ .. రూలర్ సినిమా కోసం ఆ చిత్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అత్యుత్సహంతో చేయిస్తున్న ఈ వెరైటీ ప్రయోగం ఎక్కడ బెడిసి కొడుతుందోనని భయపడుతున్నారు... ఆందోళన చెందుతున్నారు.
ఈ చిత్రం కోసం బాలయ్య సరసన వేదిక, భూమిక వంటి అవుట్ డేటెడ్ హీరోయిన్స్ ను తీసుకోవడం కూడా వాళ్లకు నచ్చడం లేదు. కె.ఎస్.రవికుమార్-బాలకృష్ణ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన 'జై సింహా' జస్ట్ ఎవరేజే సినిమాగా నిలిచింది. ఆ చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణ్ 'రూలర్' సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఇన్ని ప్రతికూల అంశాలు కలిగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే!! కంటెంట్ బాగుంటే ఈ ప్రతికూల అంశాలేవీ పరిగణనలోకి రావు. హిట్టు కొట్టే అవకాశం ఉంటుంది.