రజనీకాంత్ పార్టీ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 31న రజనీ తన పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈలోగా పార్టీ పేరుని రిజిస్టర్ చేసుకుని, ఎన్నికల సంఘం నుంచి ఆపార్టీ గుర్తుని ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రజనీ. రజినీకాంత్ తన కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'( ప్రజాసేవ పార్టీ ) అనే పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
రజనీకాంత్ సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో బాషా ఒకటి. అందులో రజనీ ఆటో డ్రైవర్గా నటించారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.