మెగాస్టార్‌ పిలిచినా రజనీకాంత్‌ రాలేదేం.?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మంచి స్నేహితులు. ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌లో భాగంగా, రజనీకాంత్‌ని నామినేట్‌ చేశారు చిరంజీవి. కానీ, టాలీవుడ్‌ మెగాస్టార్‌ విజ్ఞప్తిపై తమిళ సూపర్‌ స్టార్‌ ఇంకా స్పందించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మరోపక్క, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నామినేట్‌ చేసిన వారిలో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇంకా స్పందించలేదు. నిజానికి ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ జస్ట్‌ ఫర్‌ ఫన్‌ కోసం కాదు, కరోనా వైరస్‌ పట్ల అవగాహన పెంచడం కోసం. దీన్ని కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా చూడలేం.

 

అయితే, రజనీకాంత్‌ స్పందించలేదనో, బాలయ్య, నాగ్‌ లైట్‌ తీసుకున్నారనో అనుకోవడానికి వీల్లేదు. ముందు ముందు వాళ్ళ స్పందనలూ ఇంకాస్త కొత్తగా రాబోతున్నాయేమో. చిరంజీవితో కలిసి రజనీకాంత్‌ ఈ మధ్యనే సెల్ఫీ వీడియో ద్వారా ఓ ఇంట్రెస్టింగ్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం చేశార.. అందులో అమితాబ్‌ బచ్చన్‌ తదితరులూ వున్నారు. ఇక, అక్కినేని నాగార్జున విషయానికొస్తే.. సంగీత దర్శకుడు కోటి, ‘కరోనా వైరస్‌’పై రూపొందించిన పాటలో కన్పించారు.

 

నందమూరి బాలకృష్ణ, విరాళం ప్రకటించడంతోపాటుగా, హైద్రాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రి వ్యవహారాల్ని ఇంకాస్త ఎక్కువ ఫోకస్‌తో చూసుకుంటున్నారు. ఎవరి బిజీలో వాళ్ళున్నప్పుడు వాళ్ళేదో ఈ ఛాలెంజ్‌ని లైట్‌ తీసుకున్నారని ఎలా అనుకోగలం.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS