సినిమా విడుదల తేదీలని షూటింగ్ ప్రారంభమయ్యే రోజునే చెప్పే మంచి సాంప్రదాయం హిందీ చిత్ర సీమలో ఉన్నట్టుగా దక్షిణాన ఉన్న చిత్ర పరిశ్రమల్లో లేదు. దాని కారణంగానే వివిధ చిత్రాలు సరైన తేదీలలో విడుదల కాక రెవిన్యూ పరంగా చాలా నష్టపోతుంటాయి.
ఇక అలాంటి పరిస్థితే ఇప్పుడు ఒకటి వచ్చిపడింది. అదేంటంటే- 2018 ఏప్రిల్ లో మహేష్ భరత్ అను నేను & అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాలు విడుదల అవ్వనుండడంతో ఆ రెండు చిత్రాల నిర్మాతలు ఈ రెండు చిత్రాలు కనీసం రెండు నుండి మూడు వారల వ్యవధిలో విడుదల చేసుకోవాలని లేకపోతే రెండు చిత్రాల కలెక్షన్స్ పైన ప్రభావం పడుతుంది అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ తరుణంలో రజినీకాంత్ రోబో 2 చిత్రం కూడా ఏప్రిల్ లోనే ఉంటుంది అని చెప్పడంతో ఇప్పుడు కొత్త చిక్కులు మొదలయ్యాయి. రజినీకాంత్ కి దర్శకుడు శంకర్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒక పెద్ద తెలుగు చిత్రం రేంజ్ లోనే ఉంటుంది.
ఇక వెంటనే మహేష్, అల్లు అర్జున్ చిత్రాల నిర్మాతలు రోబో నిర్మాణ సంస్థ వారికి ఈ విషయమై పునరాలోచించాలని కోరుతున్నారు. అసలైతే రోబో చిత్రం జనవరిలో విడుదల కావాల్సి ఉండగా అనుకోని విధంగా ఏప్రిల్ కి మారిపోయింది.
మొత్తానికి.. మహేష్ & బన్నీ కి రోబో తలనొప్పి పట్టుకుంది.