ర‌జ‌నీ పారితోషికంపై షాకింగ్ న్యూస్‌!

మరిన్ని వార్తలు

ర‌జ‌నీ కాంత్‌... వ‌య‌సు పెరుగుతున్నా వ‌న్నె త‌గ్గ‌ని హీరో. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కు అభిమానులున్నారు. రజ‌నీ సినిమా వ‌స్తోందంటే జ‌పాన్ వాళ్లు సైతం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తుంటారు. ర‌జ‌నీ సినిమా ఎలా ఉన్నా, తొలి రోజే రికార్డులు బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం. అదీ.. త‌న‌క్రేజ్‌. ద‌క్షిణాదినే కాదు, భార‌త‌దేశం మొత్తంలో అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయ‌కుల్లో ర‌జ‌నీ ముందు వ‌రుస‌లో ఉంటాడు.

 

ర‌జ‌నీ పారితోషికంపై ఇది వ‌ర‌కు చాలాసార్లు ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. ఈసారి ఓ షాకింగ్ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ర‌జ‌నీ పారితోషికం ఇప్పుడు వంద కోట్ల‌కు చేరింద‌న్నది టాక్‌. త్వ‌ర‌లోనే క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ర‌జ‌నీ ఓ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం ర‌జ‌నీకి వంద కోట్ల పారితోషికం ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌జ‌నీకి ఇంత మొత్తంలో పారితోషికం ఎవ‌రూ ఇవ్వ‌లేద‌ట‌. స్వ‌యంగా క‌మ‌ల్.. ర‌జ‌నీకి ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వాల‌నుకోవడం త‌మిళ నాట హాట్ టాపిక్ గా మారింది. క‌మ‌ల్ బ్యానర్ లో ర‌జ‌నీ కాంత్ సినిమా చేస్తున్నాడంటే.. అదేదో ఫ్రెండ్ షిప్ కోసం సినిమా చేస్తున్నాడులే అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వాల‌నిచూడ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS