కరోనా ఇంకా తగ్గలేదు. లాక్ డౌనూ ఎత్తలేదు. కానీ మందుకి మాత్రం గేట్లు ఎత్తేశారు. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మనిషి చనిపోతే పూడ్చడానికి పదిమందికే ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వాలు.. వందలమంది మద్యం షాపుల దగ్గర తాగిపడిపోవచ్చుని గ్రీస్ సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ విమర్శలతో గొంతు కలిపారు. మద్యం అమ్మకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట కాలంలోనూ సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు కరెక్ట్ కాదని, ఇకపై మద్యం అమ్మకాలను ఇలానే కొనసాగితే తిరిగి మరోసారి అధికారంలోకి రారన్న విషయం మర్చిపోవద్దని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఓ హెచ్చరిక ఇచ్చారు.
రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి రేసులో వుండరు కానీ, తన పార్టీలో వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఇదివరకే చెప్పారురజనీ. ఇలాంటి నేపధ్యంలో రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.