కాలా తమిళ సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - April 06, 2018 - 12:01 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తయింది. అయితే ఇది తమిళ వెర్షన్ కి సంబందించిన సెన్సార్ రిపోర్ట్ అని తెలుస్తున్నది.
 
ఆ సెన్సార్ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే, సెన్సార్ వారు ఈ చిత్రంలో 14 కట్స్ సూచిస్తూ U/A సర్టిఫికేట్ ఇచ్చారు. దీనితో ఇక ఈ చిత్రానికి విడుదలకి క్లియర్ అయింది. ఇదేసమయంలో ఈ కాలా చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్న సందేహాలు ఇంకా నెలకొనే ఉన్నాయి.

 

ఎందుకంటే, ఈ చిత్ర నిర్మాత అయిన హీరో ధనుష్ ఇంతకముందే ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలవుతుంది అని ప్రకటించాడు.
ఇందుకే మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు తమ విడుదల తేదీలు మార్చుకున్నాయి.

 

అయితే ఆ తరువాత మారిపోయిన పరిణామాలు వల్ల ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. చూద్దాం.. ఈ చిత్రం రిలీజ్ పైన మరో తాజా ప్రకటన ఏమైనా వెలువడుతుండా లేదా?!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS