'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌ - విలన్‌ ఎవరు?

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ 'ఎన్‌టిఆర్‌'కి సంబంధించి నటీనటులపై ఇంకా క్లారిటీ రాలేదు. తేజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెల్సిందే. లక్ష్మీపార్వతి పాత్ర కోసం బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. అవింకా ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పించడంలేదు. 

మరోపక్క, శ్రీదేవి పాత్రలో దీపికా పడుకొనే నటించబోతోందనే గాసిప్‌ వచ్చింది. అది కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఇలాంటి సినిమాలకి తారాగణం కూడా ముఖ్యమే. అందుకే, దర్శకుడు తేజతోపాటు హీరో బాలకృష్ణ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే, 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో విలన్‌ ఎవరు? అనే అంశం దగ్గర చాలా చర్చ జరుగుతోందట చిత్ర దర్శక నిర్మాతల మధ్య. విలన్‌ పాత్ర లేకపోతే, హీరో పాత్రకి వెయిట్‌ వుండదు. కానీ, విలన్‌గా ఎవర్ని చూపించాలి? అన్నదే ప్రశ్న ఇక్కడ. 

ఆ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదుట. సినీ రంగంలో ఎన్‌టిఆర్‌కి శతృవులెవరూ లేరు. రాజకీయాల్లో మాత్రం, కాంగ్రెస్‌ పార్టీతో ఆయనకు వైరం వుంది. కానీ, రాజకీయాలు టచ్‌ చేస్తే చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. దాంతో విలన్‌ ఎవరు? అనే విషమ్మీద ఇంకా క్లారిటీ రాలేదని, దర్శకుడు తేజ - హీరో బాలకృష్ణ ఈ విషయమై మల్లగుల్లాలు పడుతున్నారనీ సమాచారమ్‌. 

కథ ఫైనల్‌ అయిపోయి, సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళాక ఈ విలన్‌ గందరగోళమేమిటో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS